కార్తీక మాసం సందర్భంగా రంపచోడవరం DSP సాయి ప్రశాంత్ భక్తులకు కీలక సూచనలు చేశారు. రంపచోడవరం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని 8 ప్రధాన శివాలయాల సమీపంలో ఉన్న వాగులలోకి ఎవరూ దిగవద్దని ఆయన ఆదేశించారు. కార్తీక మాసంలో పూజలు నిర్వహించుకునే భక్తులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు.