670 మంది పోలీసులతో ఎన్నికల బందోబస్తు..383 మందిపై బైండోవర్

నవంబరు 5న జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రశాంత నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 670 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలవరం ఎస్పీ కే. చక్రవర్తి బుధవారం తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా 383 మంది చెడు నడత కలిగిన వ్యక్తులు, రౌడీషీటర్లపై బైండోవర్ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి 71 కేసులు నమోదు చేయగా, 133. 7 లీటర్ల అక్రమ మద్యం, రూ. 5. 10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించు కోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕