ఎటపాక: మధ్యాహ్న భోజనం తిని ఆసుపత్రి పాలైన విద్యార్థులు

అల్లూరి జిల్లా ఎటపాక మండలం గౌరీదేవిపేటలో జడ్పీ హైస్కూల్లో శుక్రవారం మధ్యాహ్న భోజనం తిని 21 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్థానిక ప్రాథమిక ఆస్పత్రికి తరలించగా ఇప్పుడు వారికీ ఎలాంటి ప్రమాదం లేదని  వైద్యులు తెలిపారు. అన్నం సరిగ్గా ఉడకలేదని విద్యార్థులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళనకు గురై పాఠశాలకు చేరుకున్నారు. భవిష్యత్తులో భోజనం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థులు కోరారు.

సంబంధిత పోస్ట్