అంగన్వాడీ వర్కర్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

రాజవొమ్మంగి మండలం బడదనాంపల్లి పంచాయితీ చినరెల్లంగిపాడు గ్రామ అంగన్వాడీ వర్కర్స్ సరోజిని భర్త అశ్వస్థతకు గురికావడంతో రాజవొమ్మంగి సెక్టార్ తరుపున ప్రాజెక్ట్ యూనియన్ లీడర్లు కె. వెంకటలక్ష్మి, చిన్ని కుమారి లు రూ. 7 వేలు ఆర్ధిక సహాయాన్ని మంగళవారం ఇంటికి వెళ్లి అందించారు. పలువురు అంగన్వాడీ వర్కర్స్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕