అల్లూరి సీతారామరాజు జిల్లా, రాజవొమ్మంగి మండలంలోని మూడు పీ.హెచ్.సి.లలో పనిచేస్తున్న నలుగురు హెచ్.వి.లకు పీ.హెచ్.ఎన్.లుగా పదోన్నతులు లభించాయి. రాజమండ్రి ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు కార్యాలయంలో ఆర్.జె.డి.బి. సుజాత కౌన్సిలింగ్ శనివారం నిర్వహించారు. హెచ్.వి. అప్పలనర్స కాండ్రకోట, లొసుల లక్ష్మమ్మ తాళ్ళపాలెం ఆసుపత్రికి, హెచ్.వి. నీలాద్రి లక్ష్మి తూరంగికి, భూముల వెంకటరమణ చౌటిపల్లికి బదిలీ అయ్యారు. పోలవరం జిల్లాలో 15 మంది హెచ్.వి.లకు పీ.హెచ్.ఎన్.లుగా పదోన్నతులు దక్కాయి.