పార్టీ కష్టకాలంలో పని చేసిన వారికి భవిష్యత్తు : ఎమ్మెల్యే

రాజవొమ్మంగి మండలం శరభవరం పంచాయతీ వనకరాయి గ్రామంలో బుధవారం, ఏ. పి. ఐ. ఐ. సి డైరెక్టర్ గొల్లపూడి పెద్దిరాజు అధ్యక్షతన ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి టిడిపి కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తమ పార్టీ అధికారంలో లేని కష్టకాలంలో అండగా నిలిచిన వారందరికీ సరైన సమయంలో మంచి భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, APIIC డైరెక్టర్ గొల్లపూడి పెద్దిరాజు, AMC చైర్మన్ లోతా లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్