ఏటపాక మండలం గొల్లగుప్పలో ఉచితంగా పంపిణీ చేసిన మాత్రలు వికటించి ఏడేళ్ల గిరిజన బాలిక మడివి జమున మృతి చెందడంపై బుధవారం ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ, బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మందులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయం జరగకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.