అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలీసుల తనిఖీల్లో భారీగా లిక్విడ్ గంజాయి పట్టుబడింది. చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ లమడంపల్లి నుంచి గంజాయి అక్రమ రవాణాపై అందిన ముందస్తు సమాచారంతో మంగళవారం లోతు గడ్డ బ్రిడ్జి సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 11 కేజీల లిక్విడ్ గంజాయి, రెండు సెల్ ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారిని రిమాండ్‌కి తరలించారు.