గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో రూ.50 కోట్లతో మౌలిక సదుపాయాలు

అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం పరిధిలోని 71 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 50 కోట్లు ఖర్చు చేయనున్నట్లు డి.డి. రుక్మాంగదయ్య తెలిపారు. మంగళవారం (జూన్ 30) జడ్డంగి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీఎం జన్మన్ పథకంలో 15 హాస్టల్ బ్లాకుల నిర్మాణానికి రూ. 45 కోట్లు, 10 వేల మంది విద్యార్థినులకు కాస్మోటిక్స్ కిట్లు, 55 ఆశ్రమ పాఠశాలల్లో రూ. 1.65 కోట్లతో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్