రాజవొమ్మంగి మండలం జడ్డంగి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని రజిత, జావెలిన్ త్రో విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరంలో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి ఎంపికల్లో ఆమె ప్రతిభ కనబరిచింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మమ్మ, వార్డెన్ కారం సత్యనారాయణమ్మ, పీఈటీ హైమతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థినిని అభినందించారు. రాజవొమ్మంగి బాలికొన్నత ఆశ్రమ విద్యార్థినులు, ఏ. పి. ఆర్. విద్యార్థినులు కూడా ఎంపికయ్యారు.