రాజవొమ్మంగి మండల కేంద్రంలోని ఏకలవ్య ఇంగ్లిష్ మీడియం మోడల్ పాఠశాల చైర్మన్గా ఆదివాసీ నాయకుడు జర్తా రాజు ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్గా పొత్తూరి రాదాకృష్ణ ఎన్నికయ్యారు. 140 మంది తల్లిదండ్రులలో 97 మంది రాజుకు మద్దతు తెలిపారు. ప్రిన్సిపాల్ కృష్ణారావు ఎంపిక పత్రాలను మంగళవారం అందజేసి అభినందనలు తెలిపారు. విద్యార్థుల సమస్యలపై స్పందించే రాజు ఎన్నిక పట్ల ఆదివాసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.