రాజవొమ్మంగి మండలం జడ్డంగి బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలో 34 మహిళా స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది రూ. 3. 50 కోట్లు మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలను ఇవ్వడం జరిగిందని జడ్డంగి బ్రాంచ్ మేనేజర్ అరుణ్ కుమార్ సోమవారం తెలిపారు. 700 మంది రైతులకు రూ. 10. 50 కోట్లు రుణాలను ఇవ్వడం జరిగిందన్నారు. సకాలంలో రైతులు రుణాలను చెల్లించి తిరిగి పొందాలని మేనేజర్ అన్నారు. బంగారంపై తక్కువ వడ్డీతో రుణ సౌకర్యం కూడా ఉందని తెలిపారు. అసిస్టెంట్ మేనేజర్ చక్రధర్ రావు, డిఆర్వో అమిత్, అప్పన్నబాబు, భూషణం, దేవి పాల్గొన్నారు