మారేడుమిల్లి మండలంలోని సున్నంపాడు గ్రామ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగిందని మారేడుమిల్లి పోలీసులు గురువారం తెలిపారు. రంపచోడవరం నుంచి ఛత్తీస్గఢ్ వైపు వెళుతున్న లారీ ఎదురుగా వస్తున్న బొలెరో ఢీకొన్నాయి. బొలెరో డ్రైవర్ కు కాలు విరిగిపోయిందని పోలీసులు చెప్పారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.