మారేడుమిల్లి: అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన లారీ

మారేడుమిల్లి మండలం బొడ్లంక సమీపంలో పెళ్లి రేవు వాగువద్ద శుక్రవారం ఉదయం బ్లాక్ మెటల్ రవాణా చేస్తున్న లారీ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో లారీ ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. లారీ రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్