ఆశా కార్యకర్తలతో పనులు: మంత్రి విచారణకు ఆదేశం

మారేడుమిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా కార్యకర్తలతో పారిశుద్ధ్య పనులు చేయించిన ఘటనపై రాష్ట్ర వైద్యరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ విచారణకు ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం పరిధిలోని మారేడుమిల్లి పిహెచ్సి వద్ద ఈ సంఘటన జరిగింది. ఆశా కార్యకర్తలతో ఆరోగ్య సంరక్షణ పనులు మాత్రమే చేయించాలని, ఇతర పనులు అప్పగించవద్దని మంత్రి స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో మంత్రి స్పందించి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని విచారణ జరిపి మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్