పోలవరం జిల్లా ఎస్పీని కలిసిన ఎమ్మెల్యే దంపతులు

పోలవరం జిల్లా నూతన ఎస్పీ కె. చక్రవర్తిని సోమవారం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్ మిరియాల శిరీషాదేవి, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మఠం విజయ్ భాస్కర్ మర్యాదపూర్వకంగా  కలిశారు. జిల్లాలో శాంతిభద్రతలపై ప్రత్యేక నిఘా పెట్టి నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. యువత చెడు మార్గాలకు దూరంగా ఉండేలా సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీని శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్

✕
✕