రాజవొమ్మంగి ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి మంగళవారం అల్లూరిజిల్లా కొయ్యురు మండలం గుడ్లపల్లి సీతారాముల ఆలయ అభివృద్ధికి రూ. 10 వేల నగదు విరాళం అందించారు. అన్ని మతాలను గౌరవిస్తూ సఖ్యతతో జీవించాలని, ఆలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, గ్రామ పెద్దలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.