రాజవొమ్మంగి మండలం కిండ్ర గ్రామ పోలింగ్ బూత్‌లో గురువారం రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, ఆమె భర్త, జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి ఎం. విజయ్ భాస్కర్ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎమ్మెల్యే శిరీషాదేవి ప్రజలను కోరారు.