ఆశ్రమ పాఠశాలకు సీసీ రోడ్డు కల్పించాలని ఎమ్మెల్యే వినతులు

జడ్డంగి గిరిజన సంక్షేమ బాలికోన్నత ఆశ్రమ పాఠశాలకు సమీప జడ్పీ ఉన్నత పాఠశాల నుంచి సీసీ రోడ్డు సౌకర్యం కల్పించాలని హెచ్‌ఎం బి. లక్ష్మమ్మ, మహిళా ఉపాధ్యాయులు రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవికి వినతి అందించారు. సోమవారం జడ్పీ పాఠశాల సీసీ రోడ్డు పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేను కలిసి వీధి లైట్లు, పాఠశాల చుట్టూ పెరిగిన మొక్కల సమస్యలను వివరించారు. పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్

✕
✕