వాల్మీకి తెగ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే శిరీష విజ్ఞప్తి

, రంపచోడవరం నియోజకవర్గ శాసనసభ్యురాలు ఎం. శిరీష విజయ భాస్కర్, వాల్మీకి తెగ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ట్రైబల్ అడ్వైజరీ కమిషన్ చైర్మన్, సభ్యులకు విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కమిషన్ సహకరించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. కమిషన్ సభ్యులు సానుకూలంగా స్పందించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులతో పాటు సశివాలయానికి చెందిన జనరల్ సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్