పోలవరం జిల్లా అడ్డతీగల మండలం రాజేంద్ర ఫంక్షన్ హాల్‌లో మంగళవారం ఉదయం 10 గంటలకు నిర్వహించే కిసాన్ మేళా కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో NDA కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నాయకులు కోరారు.