వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన

రాజవొమ్మంగి మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పర్యటించారు. నెల్లిమెట్ల, ఎర్రంపాడు వాగులను పరిశీలించారు. దూసరపాము, డి. మల్లవరం గ్రామాల్లో తుపాన్ ప్రభావంతో నష్టం జరిగిన ఇళ్లను పరిశీలించి, బాధితులకు నిత్యావసర వస్తువులను అందించి, ప్రభుత్వ సహాయం అందెందుకు కృషి చేస్తానన్నారు. రాజవొమ్మంగి ఆసుపత్రిని తనిఖీ చేశారు. తహసీల్దార్ స్వామి, మాజీ ఎంపిటిసి కొంగర సావిత్రి, గణజాల తాతారావు, ఊటా చిన్నబాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕