రాజవొమ్మంగి మండలం వట్టిగడ్డ గ్రామంలో గురువారం ప్రభుత్వ సంచార వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఎం.ఎల్.హెచ్.పి. లక్ష్మణ్ 50 మందికి వైద్య పరీక్షలు చేసి, మందులు అందజేశారు. వర్షాలు కురుస్తున్నందున కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎల్.హెచ్.పి. లక్ష్మణ్, ఏ.ఎన్.ఎం. చంద్రావతి, డి.ఈ.ఓ. శ్రీనివాస్, పైలట్ శివకన కరాజు, ఆశ వర్కర్స్ అమ్మిరాజు, దుర్గ, కుమారి పాల్గొన్నారు.