జనసేన పదవులకు 147 దరఖాస్తులు స్వీకరించిన నాగేంద్రబాబు

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం ఆర్. కె. రెసిడెన్సీలో శనివారం జనసేన పార్టీ బలోపేతంలో భాగంగా ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు పార్టీలో గ్రామ, మండల, పార్లమెంట్ స్థాయి విభాగాల కోసం పార్టీ శ్రేణులు చేసుకున్న దరఖాస్తులను స్వీకరించారు. పంచాయితీలకు 67, మండలాలకు 67, పార్లమెంట్ పరిధిలో 13 అర్జీలు వచ్చాయి. ఆదివారం  కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అర్హులైన వారి ఎంపిక పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జరుగుతుందని నాగేంద్రబాబు తెలిపారు. కూటమి కలిసి ఉన్నంతకాలం జనసేన కలిసి పనిచేస్తుందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్