గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం, ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి

రాజవొమ్మంగి ప్రాజెక్ట్ సీడీపీఓ అనంతలక్ష్మి గర్భిణీలు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారంతో పాటు ఆరోగ్య జాగ్రత్తలను పాటించాలని సూచించారు. శనివారం లోదొడ్డి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషణ్ మా కార్యక్రమంలో మునగాకు, నిమ్మ, జామ, బొప్పాయి, ఆకుకూరలు వంటి పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ, ఆశా సిబ్బంది, గర్భిణీలు, బాలింతలు, స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕