గ్రామస్థాయి సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రజల వద్దకే - ఎమ్మెల్యే శిరీషా దేవి

అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, గుర్తేడు మండల కేంద్రంలో శనివారం 'ఒక నెల ఒక నియోజకవర్గం' కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు ప్రజల వద్దకే వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీషా దేవి మాట్లాడుతూ, గ్రామస్థాయి సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దినేష్ కుమార్ గిరిజన విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

సంబంధిత పోస్ట్