కొమరాపురంలో మహిళల భద్రతపై పోలీసులు అవగాహన

రాజవొమ్మంగి మండలం కొమరాపురం గ్రామంలో జూలై ఒకటో తేదీన మహిళలపై జరిగే నేరాల నియంత్రణకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సి. ఐ. సన్యాసినాయుడు మాట్లాడుతూ మహిళలపై వేధింపులు, గృహహింస, ఈవ్ టీజింగ్, లైంగిక వేధింపులు, సైబర్ నేరాలు, సోషల్ మీడియా మోసాలపై వివరించారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం, పోలీసు శాఖ పలు చర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్. ఐ. చినబాబు, కానిస్టేబుల్ ప్రసాద్ రెడ్డి, హోం గార్డు సి. హెచ్. చిన్నారావు, స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్