రంపచోడవరం మండలం ఫోక్స్ పేట రేంజ్ పరిధిలో అటవీ సిబ్బందికి మెగా ఫోన్స్ అందజేసిన సబ్ DFO, పులి కదలికలపై విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. పులికి అమర్చిన ట్రాకర్ ద్వారా అందిన సమాచారాన్ని వేగంగా పరిసర గ్రామాల్లో ప్రజలకు తెలియజేయాలని, రిజర్వ్ ఫారెస్ట్ అటవీ ప్రాంతాలకు పశువులను, మనుషులను వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.