తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాజవొమ్మంగి మండలం దూసరిపాము గ్రామంలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. గురువారం ఉదయం భారీ వర్షం కురవడంతో పక్కనే ఉన్న కాలువ పొంగి, ఇళ్లలోకి నీరు చేరిందని గ్రామస్థులు తెలిపారు. మండల వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, వాగులు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్నాయి.