రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అక్టోబర్ 1న నిర్వహించిన సేవా సంకల్ప్ అభియాన్ జిల్లా స్థాయి చిత్రలేఖనం, వక్తృత్వ పోటీల్లో రాజవొమ్మంగి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపారు. వక్తృత్వంలో 8వ తరగతి విద్యార్థిని సత్య వరలక్ష్మి ప్రథమ బహుమతి, చిత్రలేఖనంలో 7వ తరగతి విద్యార్థి బి. జీవన్ దుర్గేంద్ర తృతీయ బహుమతి సాధించారు. ఈ విషయాన్ని పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం సీహెచ్. శివకృష్ణ తెలిపారు. శనివారం పీఎంసీ చైర్మన్ బి. శ్రీనివాస్ విద్యార్థులు, ఉపాధ్యాయులు కొండబాబును అభినందించారు. ఉపాధ్యాయులు కొండబాబు, సత్యబాబు, స్వామి, జయలక్ష్మి పాల్గొన్నారు.