రాజవొమ్మంగి: రోడ్డు ప్రమాదంలో యువకులకు తీవ్ర గాయాలు

అల్లూరి జిల్లా రాజవొమ్మంగి మండలంలోని మిర్యాల వీధి సమీపంలో సోమవారం అర్థ రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. అడ్డతీగల నుంచి బైకుపై ముగ్గురు యువకులు కాకరపాడు తీర్థానికి వెళుతుండగా బైకు అదుపు తప్పి పడిపోయారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులకు తీవ్రమైన గాయాలు కాగా ఒకరి కాలు విరిగింది. ముగ్గురిని స్థానికులు అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్