రంపచోడవరం మండలం రంపలోని 12వ శతాబ్దానికి చెందిన పురాతన శివాలయంలో శివరాత్రి ఉత్సవాలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. చోళుల కాలంలో నాగవంశీయులు నిర్మించిన ఈ ఆలయానికి వేలాది మంది భక్తులు వస్తారు. ఈ నెల 15 నుంచి 19 వరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.