రంప: నలుగురు పాత ముద్దాయిల అరెస్ట్

దేవీపట్నం, గంగవరం, మారేడుమిల్లి మండలాల్లో గతంలో నాటు సారా బట్టీలపై దాడులు నిర్వహించిన కేసుల్లో నలుగురు పాత ముద్దాయిలను గురువారం అరెస్టు చేసినట్లు రంపచోడవరం ఎక్సైజ్ సీఐ శ్రీధర్ తెలిపారు. అరెస్టు చేసిన నిందితులను కోర్టులో హాజరు పరిచినట్లు ఆయన పేర్కొన్నారు. నాటు సారా క్రయ, విక్రయాలు ఎక్కడ జరిగినా సమాచారం అందిన వెంటనే అరికడతామని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్