రంపచోడవరం: పసి బిడ్డను ఎత్తుకెళ్లిన ఘటన

రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో 5 రోజుల మగ బిడ్డ మంగళవారం మాయమయ్యాడని స్థానికులు తెలిపారు. వై. రామవరం మండలం పాముగంటి వాసి కళావతికి 5 రోజుల క్రితం బిడ్డ పుట్టాడు. పచ్చకామెర్లు ఉన్నాయని ఇంక్యుబేటర్లో ఉంచాలని నమ్మించిన ఓ మహిళ బాబును ఎత్తుకెళ్లిందని చెప్పారు. వెంటనే ఆసుపత్రి సిబ్బంది సీసీ పుటేజ్ను పరిశీలించారు. ఆ మహిళ చిత్రాన్ని మీడియాకు విడుదల చేశారు. ఈఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్