రంపచోడవరం సమీపంలో మారేడుమిల్లి రహదారిలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుజ్జిమామిడి వలస పంచాయతీ గోందివాడకు చెందిన సత్యనారాయణ రెడ్డి అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బైక్ పై వేగంగా వస్తున్న సత్యనారాయణ రెడ్డి, అకస్మాత్తుగా ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన అతన్ని వెంటనే 108 వాహనంలో రంపచోడవరం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.