పోలవరం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన పోలియో బూత్‌ల సంఖ్యను తగ్గించడాన్ని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తక్షణమే ఉపసంహరించుకోవాలని పోలవరం CITU జిల్లా అధ్యక్షురాలు మట్ల వాణిశ్రీ డిమాండ్ చేశారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా, పోలవరం జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో పోలియో బూత్‌ల సంఖ్యను తగ్గించిన వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం అత్యంత దుర్మార్గమైనదని, దీనిని CITU తీవ్రంగా ఖండిస్తోందని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా అంతటా బూత్‌లను యథావిధిగా కొనసాగించాలని ఆమె కోరారు.