పూసివాడ మూడు రేవుల కాలువ బ్రిడ్జి మరమ్మత్తులు చేయండి

మారేడుమిల్లి మండలం పుల్లంగి పంచాయతీ పూసివాడ గ్రామంలో ఇటీవల తుపాన్ కు కురిసిన వర్షల వల్ల చెలకవీధి, పూసివాడ మధ్య వున్నా మూడురేవులు కాలువ బ్రిడ్జి క్రింద నీరు వెళ్లే తురాలు, ఇసుక, కర్రలతో నిండి నీటి ప్రవాహం బ్రిడ్జి పైన వెళుతుంది. ఆ నీటి ప్రవానికి అడ్డుపడ్డ, ఇసుక, కర్ర లకు క్లియర్ చేయటానికి అక్కడకు కనీసం క్లోక్లైన్ కూడా వెళ్లలేని పరిస్థితి, కానీ ఇక్కడ వున్నా ప్రజలకు సంతలకు, ఇతర ప్రాంతకు వెళ్లాలంటే ఇది ఒక్కటే దారి. అందుకే పూసివాడ గ్రామస్తులు గ్రామ యువత అందరు కలసి నీరు వెళ్లే తోరలలో వున్నా ఇసుక, కర్రలు తొలగించడం జరిగింది. ప్రభుత్వం స్పందించి మరమత్తులు చేయాలనీ కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕