అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి గ్రామంలోని మారేడుమిల్లి సచివాలయంలో ఆదివారం, 28 జూన్ 2026 న, ఆర్టీఐ ప్రెసిడెంట్, మాజీ ఎంపీటీసీ గొర్లె అనిల్ ప్రసాద్ (బాబీ) పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. 0-5 సంవత్సరాల పిల్లలందరూ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం కమల, అంగన్వాడీ టీచర్ కరుణ, హెల్పేర్ ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.