స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ఆయా ఎంపీటీసీ స్థానాల నాయకులు, కార్యకర్తలదేనని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. సోమవారం రాజవొమ్మంగిలో టీడీపీ మండల సమావేశం గొల్లపూడి పెద్దిరాజు అధ్యక్షతన జరిగింది. కూటమి సీట్ల కేటాయింపుపై చర్చలు జరుగుతున్నాయని, కార్యకర్తలు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఎన్నికల పరిశీలకులు కుడుపూడి సత్తిబాబు, మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, షేక్ సుభానీ, లోతా లక్ష్మణరావు, ముప్పన కేశవ్, డి. శివరామచంద్రరాజు, జి. తాతారావు వాసంశెట్టి గంగాధర్, జెట్టి మధు, బారంగి అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.