పోలవరం జిల్లా నూతన ఎస్పీ చక్రవర్తి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రాజవొమ్మంగి మండలం జడ్డంగి పోలీస్ స్టేషన్ ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, రికార్డులను పరిశీలించి కేసుల పురోగతిని సమీక్షించారు. ఆపరేషన్ త్రిసూల్ ను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. ఈ తనిఖీలో సి.ఐ. సన్యాసినాయుడు, ఎస్.ఐ. చినబాబు, ఏ.ఎస్.ఐ. సురేష్, శాస్త్రి, సుబ్బారావు, ప్రసాద్ రెడ్డి, శ్రీను, సురేష్, లింగేశ్వరి పాల్గొన్నారు.