జడ్డంగి వారపుసంతలో వినాయక విగ్రహాల ఊరేగింపు కోలాహలం

రాజవొమ్మంగి మండలం జడ్డంగి రామాలయం జంక్షన్‌లో 14 రోజుల పాటు పూజలు అందుకున్న వినాయక విగ్రహానికి ఆదివారం ఘనంగా నిమజ్జనోత్సవం నిర్వహించారు. చికిలింత గంగాలమ్మ తల్లి కోలాట బృందం, తూర్పు లక్ష్మీపురం తీన్మార్ బృందాలతో నిర్వహించిన ఊరేగింపులో చిన్నారులు, యువకులు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఉత్సవ కమిటీ భక్తులకు ప్రసాదం పంపిణీ చేసింది. రైస్ మిల్ ఏరియా, రాజవొమ్మంగి 99 క్వాటర్ విగ్రహ నిమజ్జనం కూడా మడేరులో జరిగింది. జడ్డంగి ఎస్. ఐ. చినబాబు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు విధులను నిర్వహించారు

సంబంధిత పోస్ట్

✕
✕