నాగలపల్లి అటవిలో పులి సంచారం

దేవీపట్నం మండలం నాగలపల్లి సమీప అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తోందని అటవీ అధికారి కొండలరావు బుధవారం తెలిపారు. నీరు, దట్టమైన అటవీ వాతావరణం ఉండడంతో పులి గత మూడు రోజులుగా పరిసరాల్లోనే తిరుగుతోంది. అటవీ సిబ్బంది రేడియో కాలర్ ద్వారా పులి కదలికలను గుర్తిస్తూ దానిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారులు స్థానికులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్