ఎన్నికల కౌంటింగ్‌పై సిబ్బందికి శిక్షణ

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపును పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రంపచోడవరం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన కౌంటింగ్ శిక్షణలో ఆయన మాట్లాడుతూ బ్యాలెట్ పత్రాల పరిశీలన, ఓట్ల లెక్కింపు, ఫలితాల నమోదు విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 101 ఎంపీటీసీ స్థానాలకు 202 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్. ప్రశాంత్ కుమార్, సబ్ కలెక్టర్ డి. పృథ్వీరాజ్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕