ఇంటి పై కూలిన చెట్టు

మారేడుమిల్లి పంచాయతీ మూసురు గ్రామంలో తుఫాన్ కారణంగా చెట్టు కూలి ఒక గిరిజనుడి ఇంటిపై పడి ఇల్లు ధ్వంసమైంది. మారేడుమిల్లి పంచాయతీ సర్పంచ్ కొండా జాకబ్, ఉపసర్పంచ్ బొడ్డేటి వీరబాబు మూసురు గ్రామాన్ని సందర్శించి, ఆ గిరిజన కుటుంబాన్ని పంచాయతీ తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని, ప్రభుత్వ సహాయం సక్రమంగా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డీఈ, ఏఈ, పంచాయతీ సెక్రటరీ, సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్