ఆదివాసీ భూములను పరిరక్షించాలని ఏజెన్సీలో ఆదివాసీ భూముల ఆక్రమణలను అరికట్టి, 1/70, LTR చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ డివిజన్ కోఆర్డినేటర్ పీఠ ప్రసాద్ డిమాండ్ చేశారు. మంగళవారం రాజవొమ్మంగిలో పర్యటించి ఆదివాసీల సమస్యలను తెలుసుకున్నారు. నాన్-ట్రైబల్స్ కబ్జాలోని భూములను స్వాధీనం చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లోత శ్రీను, కాకూరి మహేష్, జోగి రెడ్డి, కాకూరి నాగమణి పాల్గొన్నారు.