రెండో రోజుకు చేరిన ఆదివాసీల రిలే నిరాహార దీక్షలు

రంపచోడవరం ఐటీడీఏ ఎదుట ఆదివాసీ హక్కులు, ఉద్యోగాల సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజు కొనసాగాయి. ఆదివాసీ నిరుద్యోగులకు ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని, షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం తీసుకురావాలని, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను స్థానిక ఆదివాసీ పట్టభద్రులతో భర్తీ చేయాలని కమిటీ మంగళవారం డిమాండ్ చేసింది. 1/70, పెసా, అటవీ హక్కుల చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరింది. దీక్షలకు భారత్ ఆదివాసీ పార్టీ రాష్ట్ర వైస్ అధ్యక్షులు తెల్లం శేఖర్, పండా కృష్ణమూర్తి, ఈతపల్లి సిరిమల్లె రెడ్డి తదితరులు మద్దతు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕