ప్రకృతి వ్యవసాయంపై రెండు రోజుల శిక్షణ

రాజవొమ్మంగి మండలం మారేడుబాక పంచాయతీ ఉర్లాకులపాడులోని మణి ప్రకృతి వ్యవసాయ వనరుల నోడల్ బీఆర్‌సీ జిల్లా స్థాయి శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో మండల స్థాయి బీఆర్‌సీ పాయింట్‌ పర్సన్స్‌కు రెండు రోజుల శిక్షణ నిర్వహించారు. రైతుల్లో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచి, గ్రామస్థాయిలో విస్తరించడమే లక్ష్యంగా శిక్షణ ఇచ్చారు. ప్రకృతి వ్యవసాయ సూత్రాలు, విత్తన రకాలు, ఇన్‌పుట్స్‌ తయారీ, విత్తన బ్యాంకుల ఏర్పాటు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. డీపీఎం రాబిన్‌ సుదర్శన్, శిక్షకులు రత్నరాజు, రామస్వామి, సీతయ్య, పద్మజ, అప్పలరాజు, జీవీకే అబ్బాయి, బీఆర్‌సీ పాయింట్‌ పర్సన్స్‌ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్