అల్లూరి రాజు జిల్లా వీఆర్. పురం మండలంలోని జీడిగుప్పలో శనివారం 15 ఏళ్ల బాలిక చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందినట్లు ఎస్సై సంతోశ్ కుమార్ తెలిపారు. చింతూరు మండలంలోని వెదుళ్లపల్లికి చెందిన బాలిక కుటుంబం మిరప తోటల్లో పని చేయడానికి నెల రోజుల క్రితం జీడిగుప్పకు వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్లి పోదామని బాలిక తల్లిని కోరగా ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని ఎస్ఐ పేర్కొన్నారు.