అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి మండలం మారేడుమిల్లి పంచాయతీ కొత్త కాలనీ (బోదులూరు వెళ్లే రోడ్డు) సమీపంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాలు, గాలివాన కారణంగా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకొరిగాయి. విద్యుత్ అధికారులు, సిబ్బంది వెంటనే మరమ్మత్తు పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రజలు తడి చేతులతో స్విచ్‌లు వేయడం, విద్యుత్ తీగలను లేదా స్తంభాలను తాకడం వంటివి చేయవద్దని విద్యుత్ సిబ్బంది సూచించారు.