మారేడుమిల్లిలో వైయస్సార్ వర్ధంతి వేడుకలు

రంపచోడవరం మండలం మారేడుమిల్లి వైయస్సార్సీపీ కార్యాలయంలో 17వ వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు సత్తి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ వైయస్సార్ చేసిన సేవలను, 108, 104, జలయజ్ఞం వంటి సంక్షేమ పథకాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గొర్లె బాలాజీ బాబు, ఎంపీపీ సార్ల లలిత కుమారి, నాయకులు లకొండ రవికుమార్, కొండ జాకోబ్, బొడ్డేటి వీరబాబు, నల్లమిల్లి సుబ్బారెడ్డి, దూడ స్మిత్, సత్తి సునీల్, దూడ విక్టర్ బాబు, బలుసుమిల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్